ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి

  • ప్రభుత్వ తీరు అనాగరికం, అప్రజాస్వామికం
  • బాబు సర్కార్ ను డిస్మిస్ చేయాలి
  • రవికిరణ్ అరెస్ట్ పై స్పందించిన జస్టిస్ కట్జూ
  • ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి, ప్రధానికి లేఖ
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని జస్టిస్ మార్కండేయ కట్జూ రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశారు. పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అరెస్ట్ పై స్పందించిన కట్జూ...సోషల్ మీడియా స్వచ్ఛంద కార్యకర్తల అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించారు.  కార్టూన్లు అన్నవి భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగమని స్పష్టం చేశారు. అది ఆర్టికల్ 19(1)(a)కింద ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పౌరులకు ఉంటుందని, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని కట్జూ తెలిపారు. 

ఏపీ ప్రభుత్వ తీరు అనాగరిక, అప్రజాస్వామిక చర్య అని కట్జూ ఫైరయ్యారు.  చంద్రబాబు సర్కార్ పై ఆర్టికల్ 356 ప్రయోగించి, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖలో  కట్జూ పేర్కొన్నారు. శాసనసభను రద్దు చేసి తక్షణ చర్యలకు దిగాలని కోరారు.  ట్విట్టర్ లోనూ ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top