ప్రత్యామ్నాయానికి ప్రజల ఎదురు చూపు: వనిత

రాజమండ్రి:

రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, టీడీపీ నాయకుల వైఖరితో విసిగి పోయారనీ, ఫలితంగా వారు  ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నారని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత చెప్పారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైయస్ఆర్ తరహా సుపరిపాలన కోసం వారు ఎదురుచూస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని జైలులో కలిశారనే వంకతో తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, మరి తాను జగన్‌ను గాని, విజయమ్మను గాని ఇంతవరకూ కలవనే లేదనీ, తననెందుకు సస్పెండ్ చేశారోనన్నారు. కొవ్వూరులో ఈ నెల 4న వైయస్ఆర్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న భారీ  బహిరంగ సభలో పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో తాను ఆ పార్టీలో చేరతానని ప్రకటించారు. తనతోపాటు నియోజకవర్గం నుంచి వందలాది మంది టీడీపీ నాయకులు పార్టీలో చేరతారని వనిత తెలిపారు.

Back to Top