ప్రతి గుండె వైయస్ఆర్ అంటోంది

రాప్తాడు:

మహానేత వైయస్ఆర్ తనయ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానానికి నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అనంతపురానికి చెందిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పారు. ఇంతవరకూ జిల్లాలో లక్ష మంది ప్రజలు యాత్రలో పాల్గొన్నారన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టంచినా యాత్రలో పాల్గొనకుండా ప్రజలు  ఆగరని ఆయన స్పష్టం చేశారు. షర్మిల సాగిస్తున్న పాదయాత్ర రాజన్న యాత్రను గుర్తుచేస్తోందని పేర్కొన్నారు.  రాష్ట్రంలో ప్రతి గుండె  వైయస్ఆర్ అని కొట్టుకుంటోందన్నారు. సాయంత్రం నాగున్నర గంటలకు యాత్ర రాప్తాడు నియోజకవర్గంలోని రాచానపల్లికి చేరింది.

Back to Top