పూలేకు విజయమ్మ నివాళి

హైదరాబాద్, 12 ఏప్రిల్ 2013:

మహాత్మా జ్యోతిరావ్ పూలే 186వ జయంతిని పురస్కరించుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటైన పూలే జయంతి కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. దేశంలో మహాత్మా అని పేరు గాంచిన వారు ఇద్దరేనని, వారిలో ఒకరు గాంధీ మహాత్ములైతే, మరొకరు పూలే అని చెప్పారు. గాంధీ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడితే, పూలే సామాజిక స్వాతంత్య్రం కోసం పోరాడారని వివరించారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన పూలే మహిళా విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారనీ, ఆయన సతీమణి తొలి మహిళా ఉపాధ్యాయిని కావడం దీని ఉదాహరణని చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ 2009 ఏప్రిల్ 11న తొలిసారిగా పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కార్యక్రమంలో నల్లా సూర్యప్రకాశ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఏ.సోమయాజులు, సంస్థాగత వ్యవహారాల సమన్వయకర్త పి.ఎన్.వి.ప్రసాద్, అధికార ప్రతినిధి ఆర్.కె.రోజా, బి. జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, పుత్తా ప్రతాపరెడ్డి, కోన రఘుపతి, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top