వరంగల్ లో వైఎస్సార్సీపీ దే విజయం

 పరకాల: వరంగల్ లో వైఎస్సార్సీపీ దే విజయం అని వైఎస్సార్‌సీపీ
తెలం గాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా పరకాలలో
ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము చేపట్టిన ప్రచారంలో లభిస్తున్న స్పందనతో
వైఎస్సార్‌సీపీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిం చబోతుందని చెప్పారు. ఏ సర్వేలు ఏం
చెప్పినా బిహార్ తరహాలోనే వరంగల్ తీర్పు ఉండబోతుందని పేర్కొన్నారు. ప్రజల దీవెనలు
తమకే ఉన్నాయన్నారు. ఎన్నికల  హామీలను నెరవేర్చడంలో తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు విఫలమయ్యారని పొంగులేటి అన్నారు. దివంగత మహానేత
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల ముఖ్యమంత్రి గా పేరు తెచ్చుకున్నారని, ప్రతి పేదవాడికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి పార్టీ వారికి సంక్షేమ పథకాలను అందించిన
ఘనత ఆయనదేనన్నారు. బంగారు తెలంగాణ బదులు.. రైతుల ఆత్మహత్యల తెలంగాణగా మారిందని
విచారం వ్యక్తం చేశారు. ఏపీలోనూ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. సమావేశంలో
పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పూజారి సాంబయ్య గౌడ్, నాడెం శాంతికుమార్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు సిద్ధార్థరెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.

 

Back to Top