ప్లీనరీని విజయవంతం చేద్దాం

ఆలూరు రూరల్‌ : వచ్చే నెల 3న ఆలూరులో నిర్వహించే వైయస్సార్సీపీ ప్లీనరీని జయప్రదం చేద్దామని పార్టీ మండల కన్వీనర్‌ చిన్నఈరన్న మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆలూరు సెయింట్‌ జాన్స్‌ ఇంగ్లిష్‌మీడియం పాఠశాల ఆవరణలో ప్లీనరి ఉంటుందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ముఖ్యనేతలు చర్చిస్తారన్నారు. సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు కృషిచేస్తారన్నారు.

చిప్పగిరి : జూన్‌ 3వతేదీన ఆలూరులో నిర్వహించనున్న వైయస్సార్సీపీ మినీ ప్లీనరీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పార్టీ యువ నాయకులు గుమ్మనూరు నారాయణ, గద్దెల ఎర్రన్న, యూత్‌ అధ్యక్షుడు రాముడు కోరారు. మంగళవారం వారు చిప్పగిరిలో విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి తదితరులు హాజరవుతారన్నారు. ఆయా గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని వారు కోరారు.

కొలిమిగుండ్లః బనగానపల్లె హరిహర జూనియర్‌ కాలేజిలో జూన్‌2న జరగనున్న నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ ప్లీనరీని విజయవంతం చేద్దామని మండల అధ్యక్షుడు మొలక రాజారెడ్డి మంగళవారం తెలిపారు. నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్,మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆద్వర్యంలో జరిగే ప్లీనరీకి మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top