బాబుకి ప్ర‌జ‌లే బుద్ది చెబుతారు..అయోధ్య రామిరెడ్డి

వినుకొండ : ప‌ద్ద‌తి మార్చుకోక‌పోతే చంద్ర‌బాబుకి ప్ర‌జ‌లే బుద్ది చెబుతార‌ని వైయ‌స్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వం నీతిబాహ్యంగా వ్యవహరిస్తోందని ఆయ‌న అన్నారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నియోజకవర్గ నాయకుల, కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదని, ఎన్నికలు ముగిసిన తరువాత ప్రజాప్రతినిధిగా నిష్పక్షపాతంగా పాలన సాగించిన వారే నిజమైన నాయకులన్నారు. కార్యకర్తలు స్వార్ధం వీడి సమన్వయంతో జగనన్న సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచి ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండి పూర్తి భరోసా కల్పిస్తానని చెప్పారు. 
నిస్వార్ధంగా పాలించాల్సిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు రాష్ట్రంలో దొంగల పాలనలా దోచుకుంటున్నారని విరుచుకుపడ్డారు. తమ వారిని రక్షించుకోవడానికి ఎంతటికైనా తెగించడం రాక్షసపాలనను గుర్తుకు తెస్తోందని విమర్శించారు. 

Back to Top