మోసపూరిత పాలనపై ప్రజలు విసిగిపోయారు..


వైయస్‌ జగనే ప్రజలకు ఆశాజ్యోతి
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి

విజయనగరంః జిల్లాకు ఇచ్చిన ఒక హామీ కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు.రెండు జ్యూట్‌ మిల్లులు మూతపడిన పట్టించుకోనే నాధుడే లేదన్నారు.చంద్రబాబు మోసపూరిత పాలనపై ప్రజలు విసిగిపోయిన ప్రజలకు  వైయస్‌ జగన్‌ ఆశాజ్యోతిలా కనిపిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రతో  ప్రజల హృదయాల్లో జగన్‌ సుస్థిర స్థానం సంపాదించుకున్నారన్నారు.జిల్లా కేంద్రం ఏర్పడి 40  ఏళ్లు గడుస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేని దుస్థితి విజయనగరంలో ఉందన్నారు.  నెలరోజుల్లో మిల్లు తెరిపిస్తానన్న చంద్రబాబు హామీ ఇచ్చారని సంవత్సరం గడుస్తున్న పట్టించుకోలేదన్నారు. వైద్య కళాశాల కూడా రాలేదన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో జిల్లా కేంద్రానికి జెఎన్‌టీయూ, ఆంధ్ర యూనివర్శిటీ కౌంటర్, కేంద్ర విశ్వవిద్యాలయం వచ్చాయన్నారు.జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితులు వేలాది ఉన్నారని బాధితులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం నిరక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.
Back to Top