పవన్‌కల్యాణ్‌ చీకటి ఒప్పందాలు ప్రజలు క్షమించరు..

కాకినాడః చంద్రబాబు చేతుల్లో పుట్టిన బిడ్డ నుంచి వృద్ధులు వరుకు అందరూ మోసపోయారని వైయస్‌ఆర్‌సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. కాకినాడలో జరుగుతున్న వంచనపై గర్జన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీడీపీతో బీజేపీ,జనసేన పార్టీలు కలిసి  ఏవిధంగా వంచించాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడు ప్రమాణాస్వీకారం రోజు నుంచే ప్రజలను మోసం చేయడం మొదలు పెట్టారని విమర్శించారు. ప్రమాణాస్వీకార సమయంలో చంద్రబాబు నాయుడు  ఐదు హామీలు ఇచ్చారన్నారు. ఉద్యోగస్తుల పదవి విరమణ 58  సంవత్సరాలు పొడిగింపు, ఎన్టీఆర్‌ సుజలస్రవంతి, మహిళాల రుణామాఫీ, రైతు రుణామాఫీ, బెల్టు షాపుల నిర్మూలన హామీలిచ్చి ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు గతంలో దివంగత మహానేత వైయస్‌ఆర్‌ ఉచితవిద్యుత్, రైతురుణామాఫీ మొదటి సంతకంతోనే చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు కూడా అలా చేస్తారని చెప్పి ప్రజలు మొట్టమొదట సంతకానికి విలువనిచ్చారని, కాని నేడు ప్రజలకు చంద్రబాబు నమ్మకద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ఆంధ్రరాష్ట ప్రజలను చంద్రబాబు వంచనకు గురిచేస్తూనే ఉన్నారన్నారు. చంద్రబాబుతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్న పవన్‌కల్యాణ్‌ను  రాష్ట్ర ప్రజలు క్షమించరన్నారు. ప్రత్యేకహోదా కోసం పోరాడింది వైయస్‌ జగన్‌ ఒక్కరే అని అన్నారు.

Back to Top