ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టిన ప్రజలు

అనంతపురంః వైయస్సార్సీపీ కార్యకర్తలపై  టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలను నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లాలో  మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనుంది. ఈధర్నాలో ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ పాల్గొననున్నారు. వైయస్ జగన్ కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేక టీడీపీ కుట్రలకు తెరలేపింది. లేనివి ఉన్నట్లు ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తూ కుట్రలు పన్నుతోంది. జననేత రైతు భరోసా యాత్రను అడ్డుకునేందుకు పచ్చనేతలు పన్నిన కుయుక్తులను ప్రజలు తిప్పికొట్టారు. వైయస్ జగన్ కు అడుగడుగునా బ్రహ్మరథం పడుతూ...ప్రభుత్వ అరాచకాలపై నిప్పులు చెరుగుతున్నారు.

Back to Top