వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి చంద్రగ్రహణం వీడనుంది...

కాకినాడః ప్రత్యేకహోదాపై  చంద్రబాబు యూటర్న్‌ తీసుకుని దొంగదీక్షలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. కాకినాడలో జరుగుతున్న వంచనపై గర్జన దీక్ష కార్యక్రమంలో ఆయనమాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాకూడదనే లక్ష్యంగా టీడీపీ,కాంగ్రెస్,జనసేన పార్టీలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే తమ  రాజకీయ పార్టీలు మనుగడ ఉండదని కుట్రలు పన్నుతున్నారన్నారు.  తెలంగాణలో టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ ఫొటో  పెట్టుకుని ఓట్లు అడగడం సిగ్గు చేటరన్నారు. తెలుగు జాతికి ఎన్టీఆర్, వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిలు మాత్రమే నాయకులన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డికి ఓటు వేస్తే రాహుల్‌ గాంధీకి ఓటు వేసినట్లు అన్న చంద్రబాబు నేడు బీజేపీకి ఓటువేస్తే జగన్‌మోహన్‌ రెడ్డికి వేసినట్లు అని మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్‌తో కలవడం  చారిత్రాత్మక  అవసరం అంటున్నారని, చంద్రబాబునాయుడికే  అవసరమని, రాష్ట్ర ప్రజలకు కాదన్నారు.రాబోయే ఎన్నికల్లో  రాష్ట్రానికి చంద్రగహణం వీడిపోనుందన్నారు. పాలనలో తప్పును ఎత్తిచూపుతూ ఎవరైనా అధికార పార్టీని తిడతారని కాని పవన్‌కల్యాణ్‌ విచిత్రంగా ప్రతిపక్ష నాయకుడి తిట్టడం పట్ల ఎంత పరిణితి చెందిన నాయకుడే అర్థమవుతుందన్నారు.నిత్యం వైయస్‌ జగన్‌ ప్రజల మధ్య ఉన్నారని, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకుడిపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.  పవన్‌ సినిమాలోనే కాదు.రాజకీయాల్లో కూడా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.  కంటికి చిన్నగుల్లలేస్తే పవన్‌ పదిరోజులు పడుకున్నా పవన్‌కల్యాణ్‌కు ధైర్యం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. భయం ఉన్నోడే నాకు ధైర్యం ఉందని చెప్పుకుంటాడని దుయ్యబట్టారు. ప్రజల్లో   ధైర్యం నింపడం జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు.పవన్‌కల్యాణ్‌ ప్రతి సభల్లో కానిస్టేబుల్‌ కొడుకునని చెప్పుకుంటున్నారని, చిరంజీవి తమ్ముడినని చెప్పుకునే ధైర్యం లేదా అని ప్రశ్నించారు. చిరంజీవి లేకపోతే నీ స్థాయి ఏమిటో తెలుసుకోవాలని  మండిపడ్డారు.
Back to Top