శ్రీకాకుళం: ఎన్నికలకు ముందు లేనిపోని అబద్దాలు చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చారని పాల్గొండ ఎమ్మెల్యే విశ్వరాయి కవిత విమర్శించారు. టీడీపీ పాలనపై ఆరు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ఆమె స్వగ్రామం వండువలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. బాబు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారని తెలిపారు.