బాబు సర్కార్ పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు

హైదరాబాద్ః ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారం అన్నారు.   అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంపై ప్రజలు బాబు సర్కార్ పై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంపై వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష జరుగుతోంది. ఈసందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ...గ్రామీణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు వైయస్సార్సీపీ శ్రేణులు శ్రమిస్తున్నాయని పేర్కొన్నారు.  నెలలో 16 రోజులు తగ్గకుండా గడపగడపకూ కార్యక్రమం చేయాలని పార్టీ నిర్దేశించినట్లు స్పష్టం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top