చిత్తూరు జిల్లాలో ఆట‌విక ప‌రిస్థితి

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఆట‌విక ప‌రిస్థితి నెల‌కొంద‌ని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఆరోపించారు. వ‌రుస‌గా ఎమ్మెల్యేల మీద జ‌రుగుతున్న దాడుల్ని ఆయ‌న ఖండించారు. చిత్తూరు జిల్లా తిరుప‌తి ద‌గ్గ‌ర ఆయ‌న మీడియాతో మాట్లాడారు. న‌గ‌రి ఎమ్మెల్యే రోజాను చూస్తే ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌మీద ఆమె పోరాడుతున్నందునే భ‌య‌ప‌డుతున్న‌ట్లుగా ఉంద‌ని రామ‌చంద్రారెడ్డి విమ‌ర్శించారు. త‌ప్పులు, మోసాల్ని ఎత్తి చూపితే లాఠీల‌తో కొట్టిస్తారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.
Back to Top