తిరుపతి: పట్టిసీమ ప్రాజెక్టు కేవలం నారా లోకేష్ లబ్ధి కోసమేనని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టుతో గోదావరి డెల్టాలు సర్వనాశనం అవుతాయని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వాడవాడలా వైఎస్ఆర్ విగ్రహాలు వెలుస్తాయని, అందుకే చంద్రబాబు కుట్ర చేస్తున్నారని చెవిరెడ్డి ఆరోపించారు.<br/>బస్సు యాత్ర ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో చంద్రబాబు మోసాలను ఎండగడతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును అటకెక్కించడం కోసమే చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారని ఆయన అన్నారు. రాయలసీమపై చంద్రబాబుది కపట ప్రేమ అని, చిత్తశుద్ధి ఉంటే గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు.