పరిహారంలో అన్యాయం చేస్తే ఆందోళన

విజయనగరం 9 నవంబర్ 2012:   పంట నష్టపరిహారాన్ని అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే
అందించి మిగిలిన రైతులకు అన్యాయం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని
వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు పెన్మత్స సాంబశివరాజు హెచ్చరించారు. ఇదివరకు ఇలాగే చేశారని ఆయన విమర్శించారు.
నీలం తుపాను వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినా ఎవరూ పరామర్శించిన పాపాన పోలేదని ఆయన ఆక్షేపించారు. ఇంతదాకా నీట మునిగివున్న పొలాలను చూసిన దిక్కు లేదన్నారు. అట్టహాసంగా తన కుమార్తె వివాహానికి ఖర్చుపెట్టిన అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Back to Top