పేదలకు అండగా వైయస్ఆర్ కాంగ్రెస్

పెనమలూరు(విజయవాడ) 29 మార్చి 2013:

ప్రజా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పాలని శ్రీమతి షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని పెనమలూరులో ఆమె శుక్రవారం సాయంత్రం మహిళలతో రచ్చబండ నిర్వహించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల పటమట లంక నుంచి శుక్రవారం పాదయాత్ర ప్రారంభించారు. ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. బెల్టు దుకాణాలతో ఇబ్బంది పడుతున్నామని  మహిళలు మొరపెట్టుకున్నారు. ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకుంటే కూల్చేశారని ఓ మహిళ కన్నీటి పర్యంతమయ్యారు.  అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరింపచేస్తానని శ్రీమతి షర్మిల ఆమెను ఊరడించారు.   రేషను కార్డులు, పింఛన్లు అందడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top