పేదల కోసమే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ: ఆదిమూలం

కేవీబీపురం: పేద ప్రజల కోసమే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని సత్యవేడు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కోనేరు ఆదిమూలం అన్నారు. ఆదివారం మండలంలోని పెరిందేశం, రాగిగుంట, కళత్తూరు, ఎస్‌ఎల్‌పురం గ్రామాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల కన్వీనర్ పాలగిరి మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిమూలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెరిందేశం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ పేదల కష్టాలను చూసి చలించిపోయిన జగన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసి జన నేతను అక్రమంగా అరెస్టు చేసి తాత్కాలిక ఆనందాన్ని పొందుతున్నారన్నారు. ఆయన అరెస్టుతో పార్టీపై ప్రజల్లో మరింత అభిమానం పెరిగిందని తెలిపారు. బూటకపు మాటలను చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ప్రజలు గుర్తించారని, ఇక భవిష్యత్‌లో వారికి సమాజంలోనూ చోటు లేకుండా చేస్తారని పేర్కొన్నారు.

టీడీపీ, కాంగ్రెస్ నాయకులకు సభ్యత్వాలు
గ్రామంలో తొలి పార్టీ సభ్యత్వాన్ని టీడీపీ నాయకులే తీసుకున్నారు. టీడీపీ స్థానిక నాయకుడు మణి పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో 82 మంది టీడీపీ కార్యకర్తలు పార్టీలో సభ్యత్వం పొందారు. అదేవిధంగా వెంకటేష్ ఆధ్వర్యంలో 78 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సభ్యత్వాన్ని తీసుకున్నారు. రాగిగుంట గ్రామంలో 96 మంది టీడీపీ కార్యకర్తలు, ఎస్‌ఎల్‌పురంలో 54 మంది టీడీపీ కార్యకర్తులు పార్టీ సభ్యత్వం పొందారు. కళత్తూరు దతళితవాడలో చిన్నయ్య ఆధ్వర్యంలో 236 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రికార్డు స్థాయిలో వైయస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మురగయ్య, మునిరత్నంనాయుడు, కోన ట్రస్టు మాజీ అధ్యక్షుడు భక్తవత్సలం, వెంకటేష్, హరినాథ్, పెరుమాళ్, శేఖర్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Back to Top