పాదయాత్ర ముగిసేలోపు ప్రభుత్వ పతనం ఖాయం!

నల్లగొండ 18 నవంబర్ 2012 :  షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర ముగిసేలోపు ప్రభుత్వం పతనం కావడం ఖాయమని వైయస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా
సూర్యప్రకాశ్ అన్నారు. రాష్ట్రంలో మాదిగలంతా
జగన్మోహన్ రెడ్డి వెంటే సాగుతారన్నారు. మాదిగలు చంద్రబాబును నమ్మబోరని ఆయన ఆదివారంనాడిక్కడ వ్యాఖ్యానించారు. తెలంగాణలో షర్మిల
పాదయాత్రకు బీసీలు బ్రహ్మరథం పడతారని బీసీ సెల్ కన్వీనర్ శ్రీశైలంగౌడ్
అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డిగారికే దక్కుతుందని గ్రామీణ పారిశ్రామిక విభాగం అధ్యక్షుడు వి.ఎల్.ఎన్.
రెడ్డి వ్యాఖ్యానించారు.

Back to Top