వైయస్‌ జగన్‌ ఆరోగ్యం మెరుగుపడాలని పాదయాత్ర

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని వైయస్‌ఆర్‌ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. పిల్ల సురేష్, మానేపల్లి కరుణకుమార్, సారంపాటి లోపచారి, డేగల భాస్కర్‌ ఆధ్వర్యంలో సామర్లకోట స్టేషన్‌ నుంచి ఆంజనేయస్వామి గుడి వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో మండుటెండల్లో ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ మేరకు నేటి ప్రజా సంకల్పయాత్రకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. 
Back to Top