పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతల సమాలోచనలు

హైదరాబాద్, 6 అక్టోబర్‌ 2012: వైయస్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ ముఖ్యనేతలు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. వై‌యస్ జగ‌న్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిష‌న్‌పై సుప్రీం తీర్పు, తదనంతర పరిణామాలు, పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై సమాలోచనలు నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలతో పాటు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు హాజరయ్యారు. భేటీలో చర్చించిన అంశాలను పార్టీ గౌర‌వ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ దృష్టికి తీసు‌కు వెళతామని పార్టీ నేతలు తెలిపారు.

సమావేశం అనంతరం పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, జగన్మోహన్‌రెడ్డిని జైలులో ఉంచినంతమాత్రాన మా పార్టీ శ్రేణులు కించిత్ నిరుత్సాహం చెందవని తెలిపారు. కుట్రలు చేసిన కాంగ్రెస్‌ టిడిపిల‌, కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టులా మరింత ముందుకు వెళతామన్నారు. కాంగ్రెస్‌ - టిడిపిలు వాటికి వత్తాసు పలికే కొన్ని చానళ్ళు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ విజయమ్మ నాయకత్వంలో తాము మరింత రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమిస్తామన్నారు.
Back to Top