'పాదయాత్రతో షర్మిల చరిత్ర సృష్టిస్తారు'

కడప (వైయస్‌ఆర్‌ జిల్లా), 12 అక్టోబర్‌ 2012: మరో ప్రజాప్రస్థానం పాదయాత్రతో షర్మిల దేశంలో చరిత్ర సృష్టిస్తారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు నిలబడడం వైయస్‌ కుటుంబం ప్రత్యేకత అని అని ఆయన అభివర్ణించారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలు తమ సమస్యలను షర్మిల దృష్టికి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్ని ఫీట్లు చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి ఎంతమాత్రమూ లేదని వ్యాఖ్యానించారు. వేరుశనగపంటపై ప్రభుత్వం ఇచ్చిన లెక్కలన్నీ తప్పుల తడకలే అని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. జరిగోన నీటిని చిత్తూరుకు తరలిస్తూనే కిరణ్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆయన ఆరోపించారు.

Back to Top