పాదయాత్రలో పదం కలిపిన భారతి

తెనాలి, 21 మార్చి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి సతీమణి శ్రీమతి భారతిరెడ్డి కూడా గురువారంనాటి పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రకు ముందు తెనాలి చేరుకున్న శ్రీమతి భారతి మరదలు శ్రీమతి షర్మిలతో కలిసి మరో ప్రజాప్రస్థానంలో నడిచారు. శ్రీమతి షర్మిల తన వదిన భుజం మీద చేయి వేసి హుషారుగా నడవడం, ఆమెతో పాటు శ్రీమతి భారతిరెడ్డి కూడా చిరునవ్వుతో ముందుకు సాగడం అందరినీ ఆకర్షించింది. మరో వైపున శ్రీమతి షర్మిల ఒక చిన్నారిని ఎత్తుకు చాలా దూరం నడిచారు.Back to Top