ఒక్క నిజం కూడా చెప్పని వ్యక్తి చంద్రబాబు : వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

– హామీలు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడవడం న్యాయమేనా
– ఈ మూడున్నరేళ్లలో బాబు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
– వైయస్‌ఆర్‌సీపీ పోటీ పెట్టకపోయి ఉంటే బాబు నంద్యాల వచ్చేవారా?
– చంద్రబాబుకు అహంకారం పెరిగింది
–నాకున్న ఆస్తి దేవుడి దయ, ప్రజల దీవెనలు
– ధర్మానికి, న్యాయానికి ఓటు వేయండి

నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నైజాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బట్టబయలు చేశారు. జీవితంలో ఒక్క అబద్ధం కూడా చెప్పని వ్యక్తి సత్యహరిశ్చంద్రుడు అంటారని,  ఒక్క నిజం కూడా చెప్పని వ్యక్తిని నారా చంద్రబాబు అంటారని వైయస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రజలకు హామీ ఇచ్చి నెరవేర్చకపోవడం న్యాయమేనా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు మూడున్నరేళ్ల కాలంలో చేసిన అవినీతి, మోసాలకు, అన్యాయానికి వ్యతిరేకంగా నంద్యాల ఉప ఎన్నికలో ఓటు వేయాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులే నాకున్న ఆస్తి అని ఆయన వెల్లడించారు. శనివారం నంద్యాల పట్టణంలోని పెద్దబండ ఏరియాలో ప్రచారం నిర్వహించిన వైయస్‌ జగన్‌ స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

–  నంద్యాలలో ఓటు వేసేది ఎవరో ఒక వ్యక్తిని ఎమ్మెల్యేను చేసేందుకు ఓటు వేయడం లేదన్నారు. మూడున్నరేళ్ల కాలంలో చంద్రబాబు చేసిన మోసాలకు, అన్యాయానికి వ్యతిరేకంగా, అవినీతికి, దుర్మార్గానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నామని వైయస్‌ జగన్‌ చెప్పారు.
–ముఖ్యమంత్రి కావడం కోసం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడు. ముఖ్యమంత్రి అయిన తరువాత ఏం చేశారో ఆలోచించండి.
– ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత వెన్నుపోటు పొడవటం ధర్మమేనా?  ఈ ఉప ఎన్నిక వచ్చే దాక ఏ రోజైనా కూడా చంద్రబాబు, టీడీపీ మంత్రులను నంద్యాల రోడ్లపైనా చూశారా?
– ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నారు. పక్కా ఇల్లు కట్టిస్తానన్నారు. ఈ మూడున్నరేళ్లలో ఒక్క ఇళ్లైనా కట్టించారా?
–ప్రతి పేద వాడికి సాగు భూమి ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు. ఒక్క ఎకరా అయినా ఇచ్చాడా?
– రేషన్‌షాపుల్లో బాబు సీఎం కాకముందు 9 రకాల సరుకులు దొరికేవి. బాబు వచ్చాక బియ్యం తప్ప వేరేవి ఇవ్వడం లేదు. ఇది మోసం కాదా?
– వర్షకాలంలో చాలా కాలనీలు మునుగుతాయని చంద్రబాబుకు తెలుసు. కుందు నది వరద నుంచి నంద్యాలను రక్షించేందుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
– బెల్ట్‌ షాపులన్నీ తీసేస్తానని బాబు చెప్పారు. మద్యం, బ్రాందీ కనిపించకుండా చేస్తానన్నారు. ప్రతి వీధిలోనూ, గ్రామంలోనూ బెల్ట్‌షాపులు పెట్టించారు. హోం డెలివరీ చేస్తున్నారు.
–జాబు రావాలంటే..బాబు రావాలన్నారు. జాబు ఇవ్వలేకపోతే ఇంటింటికి నెల నెల రూ.2 వేలు ఇస్తానన్నారు. ప్రతి ఇంటికి రూ.76 వేలు బాకీ పడ్డాడు.
–ప్రత్యేక హోదాను చంద్రబాబు తీసుకురాలేదు.
– అక్కచెల్లమ్మల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మూడేళ్ల కాలంలో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా?
– రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు. బ్యాంకుల్లో బంగారం ఇంటికి తీసుకొని వస్తానని చెప్పారు. 
– ఎన్నికలకు ముందు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. 
– ముఖ్యమంత్రి హోదాలో కర్నూలుకు వచ్చిన చంద్రబాబు స్వాతంత్య్ర వేడుకల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.
– కర్నూలును స్మార్ట్‌ సిటీ చేస్తానన్నారు. ఏయిర్‌పోర్టు అన్నారు. త్రిపుల్‌ ఐటీ కాలేజీ తెస్తానన్నారు. కర్నూలు స్వీమ్స్‌తరహా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తానని చెప్పారు. ఉర్దూ యూనివర్సిటీ, అవుకు వద్ద ఇండస్ట్రీ సిటీ, ఆదోనిలో అపెరల్‌ పార్క్‌ అన్నారు. కర్నూలులో ఫుడ్‌ పార్క్‌ అన్నారు. గుండ్రెవుల ప్రాజెక్టు కడుతానని చెప్పారు. కనీసం ఏ ఒక్కటి చేయలేదు
– నంద్యాలలో ఉప ఎన్నిక వచ్చేసరికి మళ్లీ పాత అలవాట్లే. మళ్లీ అవే వాగ్ధానాలు, అవే మోసాలు. ప్రజల చెవ్వుల్లో క్వాలిఫ్లవర్‌ పెడుతున్నారు.
–ఇటువంటి వ్యక్తికి మనం ఓటు వేయాలా? రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. నిజాయితీ తీసుకొని రావాలి. కాలర్‌ పట్టుకుని నిలదీస్తారనే భయం రాజకీయనాయకులకు కలుగాలి.
– ప్రశ్నించకపోతే ప్రతి ఇంటికి మారుతి కారు అంటారు. కేజీ బంగారం అంటారు.
– నిలదీసే వారిపై కేసులు పెడతారట. గ్లోబల్‌ ప్రచారం చేసి వ్యక్తిత్వాన్ని హరిస్తున్నారు.
–బాబు మాదిరిగా మోసం చేసే గుణం నాకు లేదు. బాబులా నా వద్ద సీఎం పదవి లేదు. పోలీసుల బలం లేదు. డబ్బులు లేవు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపించే టీవీ చానల్స్‌ లేవు.
– నావద్ద ఉన్న ఆస్తి ఏంటో తెలుసా? దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 8 సంవత్సరాల క్రితం చనిపోతూ నాకిచ్చిన ఇంత పెద్ద కుటుంబమే నా ఆస్తి అన్నారు. మహానేత మన మధ్య లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు, సంక్షేమ పథకాలు ఇవాల్టికి ప్రతి గుండెలో ఉండటమే నా ఆస్తి అన్నారు.
– వైయస్‌ జగన్‌ మోసం చేయడు, అబద్ధమాడడు అన్న విశ్వసనీయతే నా ఆస్తి అన్నారు. వైయస్‌ జగన్‌ కూడా వాళ్ల నాన్నమాదిరిగానే మంచి చేయాలనే తపన పడుతున్నారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలనే నవరత్నాలు ప్రకటించారన్న నమ్మకమే నా ఆస్తి అన్నారు.  
–చంద్రబాబు కూడా మీ వద్దకు వస్తారు. ఆయన మనిషి మీ వద్దకు మూటలు మూటలు అవినీతి డబ్బు తీసుకొని వస్తారు. ఈ మూడేళ్లలో అవినీతితో సంపాదించిన డబ్బు మీకిచ్చేందుకు వస్తారు.
– చంద్రబాబుకు అహంకారం ఏరకంగా ఉందంటే. ఆయన కళ్లు నెత్తికెక్కాయి. డబ్బుతో ఎమ్మెల్యేలను సంతలో గొ్రరెల మాదిరి కొన్నారు. అదే డబ్బుతో ఓటర్లను కొనాలని చూస్తున్నారు.
– జేబులో డబ్బు తీసి మీతో దేవుడి ఫోటోతో ప్రమాణం చేయించుకుంటారు.  దెయ్యాలు మాత్రమే ఆ విధంగా చేస్తాయి. ఏ దేవుడు కూడా పాపానికి ఓటు వేయమని చెప్పడు. ఒక్క క్షణం కళ్లు మూసుకొని దేవుడ్ని తలుచుకొని ధర్మం వైపు ఉంటామని అనుకొని లౌక్యంగా వ్యవహరించండి. ఓటు మాత్రం ధర్మానికి, న్యాయానికి వేయాలని విజ్ఞప్తి చేశారు.
– ఇవాళ ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ధర్మం వైపు, న్యాయం వైపు ఉండాలని వైయస్‌ జగన్‌ అభ్యర్థించారు. విశ్వసనీయతకు, వంచనకు జరుగుతున్న పోరాటంలో మంచికి తోడుగా నిలవాలని, శిల్పా మోహన్‌ రెడ్డికి ఓటు వేసి ఆశీర్వదించాలని వైయస్‌ జగన్‌ కోరారు.

తాజా ఫోటోలు

Back to Top