<strong>జననేత పాదయాత్రలో పాల్గొనేందుకు ఖతార్ నుంచి వచ్చిన శ్రీనివాసరాజు</strong> విశాఖ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. విశాఖ జిల్లా యలమంచలి నియోజకవర్గంలోని కొండకర్ల జంక్షన్ నుంచి 248వ రోజు పాదయాత్ర ప్రారంభించిన జననేత హరిపాలెం, పెద్దపాడు క్రాస్ మీదగా తిమ్మరాజు పేట వరుకు కొనసాగింది. నవ రత్నాలతో ప్రతిఒక్కరికి లబ్ధి చేకూరుతుందని వైయస్ జగన్ హమీ ఇచ్చారు. వైయస్ జగన్ పాదయాత్రలో పాల్గొనేందుకు చింతలపాటి శ్రీనివాసరాజు ఖతార్ నుంచి వచ్చారు.. తూర్పుగోదావరి జిల్లా మలికిపురానికి చెందిన ఆయన ఖతర్‌లో స్థిరపడ్డారు. వైయస్ కుటుంబం అంటే ఎంతో అభిమానమని, పాదయాత్రకు వస్తున్న జన స్పందను టీవిలో చూసి ఒకరోజైన జగన్‌తో కలిసి నడవాలని అంతదూరం నుంచి వచ్చామన్నారు. జగన్ పాదయాత్రకు వస్తున్న జన స్పందన చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందని, ఈ సారి ప్రజలు జగనన్నకు అవకాశం ఇస్తారని తేటతెల్లమయ్యిందన్నారు.