ప్రత్యేకహోదా కోసం పోరాడిన ఎమ్మెల్యేలకు నోటీసులు

హైదరాబాద్ : టీడీపీ సర్కార్ ప్రతిపక్షంపై కక్షసాధింపుకు పాల్పడుతోంది. ప్రజల ప్రయోజనాల కోసం ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై పోరాడుతున్న వైయస్సార్సీపీపై కుట్రపూరిత రాజకీయాలు చేస్తోంది. ఆంధ్రప్రదేకు ప్రత్యేక హోదా కోసం గళం విప్పిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. 12మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.  ఈ నెల 25,26 తేదీల్లో ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుపై  వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడితే నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాడిశెట్టి రాజా, కొరుముట్ల శ్రీనివాసులు, చెర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాదర్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, సునీల్ కుమార్, కిలివేటి సంజీవయ్య, కంబాల జోగులుకు నోటీసులు ఇచ్చారు.

Back to Top