తాడిపత్రిలో ప్రజాస్వామ్యం లేదు

తాడిపత్రిలో ప్రజాస్వామ్యం లేదు
మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి

ప్రజలకు భరోసా ఇచ్చేందుకు వైయస్‌జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేపట్టారని మాజీ ఎంపి అనంతవెంకట రామిరెడ్డి అన్నారు.  ఇప్పటి వరకు 300 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను జననేత  తెలుసుకుంటున్నారని, రాజకీయాలకు అతీతంగా ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారని, తమ కష్టాలను వైయస్‌ జగన్‌కు వివరిస్తున్నారని తెలిపారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సోమవారం  తాడిపత్రి పెద్ద వడుగూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ జిల్లాలో రైతులు పంటలు పండక అవస్థలు పడుతున్నారు. పత్తి పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వారి స్వార్థం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. 

మహానేత పాలనలో పెద్ద వడుగూరు మండలానికి నీరు వచ్చిందన్నారు. టీడీపీ నాలుగేళ్ల పాలనలో నీరు రావడం లేదన్నారు. 2005, 2007లో తాడిపత్రి నియోజకవర్గంకు నీరు  ఇచ్చేందుకు పెండేకల్‌ రిజర్వాయర్, చాగల్లు రిజర్వాయర్లు నిర్మించారన్నారు. పెండింగ్‌ పనులు పూర్తి చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. యాడికి కెనాల్‌ పూర్తి చేయడంలో  ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు తమ పొలాలకు నేరుగా నీరు తీసుకెళ్లి రైతులకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. అడిగితే అమ్మా, అక్కలను దూషిస్తున్నారని విమర్శించారు. చాగల్లు రిజర్వాయర్‌కు పెనకచర్ల డ్వాం నుంచి నీరు వెళ్తే ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి, అయితే జేసీ సోదరులు పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. ఇక్కడ ఉండే పోలీసులు, ఎస్పీ ఆదేశాలను  కూడా వినడం లేదన్నారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలకు పోలీసులు గులాంలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధైర్యపడకండి, వచ్చే ఎన్నికల్లో మీ ఓటు వైయస్‌ఆర్‌సీపీకి వేయండి, మీ అందరికి మేం హామీ ఇస్తున్నాం, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదన్నారు. ఆ పరిస్థితులు మారాలంటే వైయస్‌ జగన్‌ సీఎం కావాలన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ అబ్యర్థిని గెలిపించాలని, అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామన్నారు. 
Back to Top