అనితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు

హైదరాబాద్ః అనితనుద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా అన్నారు. మహిళా సమస్యలపై పోరాడే తాను ఓ మహిళను ఎలా కించపరుస్తానని రోజా అన్నారు. తాను ఎలాంటి తప్పు  చేయలేదన్నారు. చేయనిదానికి కూడా చేశారని అధికారపార్టీ నేతలు భావిస్తే దాన్ని ఉపసంహరించుకుంటానని చెప్పారు. రిషితేశ్వరి, కాల్ మనీ సెక్స్ రాకెట్ సహా మహిళలకు సంబంధించిన అనేక అంశాలపై  అసెంబ్లీలో తాను పోరాడానని రోజా స్పష్టం చేశారు. మహిళల సమస్యలపై పోరాడుతున్నందునే తనను అన్యాయంగా ఏడాదిపాటు సస్పెండ్ చేశారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top