బాబు పైశాచిక విధానాలపై తిరగబడండి

  • చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు
  • ప్రభుత్వం బరితెగింపు రాజకీయాలు చేస్తోంది
  • సోషల్ మీడియా మీ ప్రసార మాధ్యమాలనుకుంటున్నావా బాబూ..?
  • కోట్లాది పోస్టులతో బాబు దమననీతిని ఎండగడతాం
  • బాబు అరాచకాలకు వ్యతిరేకంగా దండయాత్ర సాగించండి
  • నెటిజన్లకు అండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది
  • పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతిః విమర్శలను సద్విమర్శలుగా తీసుకునే శక్తి లేక బాబు సర్కార్ బరితెగింపు రాజకీయాలు చేస్తోందని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.  పాకిస్తాన్ మాదిరి చంద్రబాబు ప్రభుత్వం విమర్శించేవాళ్లను, ప్రజాస్వామ్యవాదులను  దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ వాళ్లపై తప్పుడు కేసులు బనాయిస్తోందని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. తిరుపతిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. కులభూషణ్ జాదవ్ ను ఉరితీయాలన్న పాకిస్తాన్ నిర్ణయాన్ని ఆపుతూ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇవ్వడం సంతోషకరమన్నారు. పాక్  దుశ్చర్యను ఖండిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని భూమన చెప్పారు. ఏపీలో ప్రజాస్వామ్యం చెరచబడుతున్నందున ఆర్టికల్ 356 ను ప్రయోగించి, ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతూ రాష్ట్రపతి, ప్రధానికి మార్కండేయ కట్జూ లేఖ రాసిన విషయాన్ని భూమన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సోషల్ మీడియా వాలంటీర్స్ ఇంటూరి రవికిరణ్, ఇప్పాల రవీంద్రలపై దారుణమైన కేసులు బనాయించి అరెస్ట్ చేసిన టీడీపీ సర్కార్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వాలను విమర్శిస్తూ కార్టూన్లు పెట్టేవారిని అరెస్ట్ చేసే పరిస్థితే ఎదురైతే....ఆర్. కె లక్ష్మణ్ జీవింతాంతం తీహార్ జైల్లో ఉండాల్సి వస్తుందని కట్జూ చేసిన వ్యాఖ్యలను భూమన వివరించారు. బాబు విధానాలు చూస్తే  శ్రీధర్, మోహన్, చంద్ర ఎవరైనా సరే అందరూ జైళ్లలో మగ్గి అక్కడినుంచి కార్టూన్లు వేసుకునే పరిస్థితి దాపురిస్తుందేమోనన్నారు.  ప్రభుత్వ సలహాదారు పరకాల  ప్రభాకర్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై భూమన ఫైర్ అయ్యారు.   మేం భావప్రకటన స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నాం.... కట్జూ  కుటుంబసభ్యులను మార్ఫింగ్ చేసి అసభ్యకర పోస్టులు పెడితే ఆయన భరిస్తారా అని ప్రభాకర్ మాట్లాడడంపై భూమన ఆగ్రహించారు. మిమ్మల్ని పొగిడితే , మీకు భజన చేస్తే భావప్రకటన స్వేచ్ఛఅని బాబు, మీ ప్రభుత్వం భావిస్తోందా అని పరకాలకు చురక అంటించారు. డ్రైవర్లు లేని కార్లు, ప్రపంచంలోనే అత్యున్నత ఫ్లైఓర్లు రాబోతున్నాయి,  అసెంబ్లీ దేవతల రాజధానిగా ఉండబోతుందంటూ చంద్రబాబు ఊహల్లో మేడలు కడుతున్నారని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో కృష్ణా జలాలతోనే కార్లు, బస్సులు తిరుగుతాయా అని చురక అంటించారు. 

మా దైవసమానుడైన వైయస్ఆర్  పుత్రిక, వైయస్ జగన్ సోదరి షర్మిలమ్మ మీద మీ అప్రాచ్యపు కూతలు. మూడేళ్ల కిందట దారుణంగా, అసభ్యంగా మీరు ఏవిధంగా పోస్టులు పెట్టారో మర్చిపోయారా బాబు. ఆరోజున మేం కంప్లైంట్ ఇస్తే పట్టించుకున్న పాపాన పోలేదు. మీ నాయకులు, కార్యకర్తలు పొందిన వికట్టాహాసలు మేం మరవలేదు. ఇవాళ మీరు వ్యక్తిత్వ హననం అని  మాట్లాడుతున్నారు. మీరా భావప్రకటన స్వేచ్ఛకు విలువ ఇచ్చేవాళ్లు అంటూ టీడీపీ సర్కార్ పై భూమన నిప్పులు చెరిగారు. తమ అభిమానులు, కార్యకర్తలు సభ్యతతో , సంస్కారంతో మీ ప్రభుత్వం చేస్తున్న దారుణాలపై పోస్టులు పెట్టారే తప్ప ఎవరిని అవమానపర్చేవిధంగా చేయలేదన్నారు. మీ భజన మోసే ప్రసార మాధ్యమాలు మీకు సచ్చీలంగా కనబడుతున్నాయేమో గానీ...సోషల్ మీడియా మీ గుప్పిట్లో లేదన్న సంగతి తెలుసుకోవాలన్నారు. యువకులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు మీ అరాచకాలకు వ్యతిరేకంగా దండయాత్ర సాగిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లను ప్రజలు మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నారు గనుకనే దాన్ని చూసి భరించలేకుండా బాబు ప్రతీకారంతో రగిలిపోతున్నాడని భూమన అన్నారు. బాబు ఉడత బెదిరింపులకు  భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైయస్ఆర్ నిజమైన అభిమానులను, వైయస్సార్సీపీ ప్రేమికులను, వైయస్ జగన్ ను అభిమానించే శ్రేణులను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే యోధులకు అందరికీ పిలుపునిస్తున్నాం. మీ శక్తిని, ప్రతిభను, మేధస్సుని రంగరించి మరింతగా టీడీపీ పైశాచిక విధానాలపై తిరగబడుతూ కోట్లకొద్ది పోస్టింగ్ లు పెట్టాలని పార్టీ ఆదేశాలను మీడియా ద్వారా వినిపించారు. మీ అందరికీ అండగా, దండగా వైయస్సార్సీపీ నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఉద్యమరూపంలో పోస్టులు చేయండి. బాబు చేతిలో నలిగిపోతున్న ప్రసారమాధ్యమాల వార్తలు కాదు మనకు కావాల్సింది.....బాబు పాలనకు భయపడి లొంగిపోయిన ప్రసార మాధ్యమాల ఆలోచనలు కాదు మనకు కావాల్సింది....మన ఆలోచనలు, ప్రజాస్వామ్యవాదుల ఆలోచనలు, ప్రజాస్వామ్యాన్ని బతికించాలని కోరుకునే ధీరులు,  ప్రభుత్వ మోసాన్ని ఎదురించగల ధీరోదాత్తుల ఆలోచన రంగరించి ప్రజలకు హరివిల్లుగా నెటిజన్ల రూపంలో చల్లండని పిలుపునిచ్చారు. వైయస్సార్సీపీ బాబు తాటాకు చప్పుళ్లకు భయపడదని హెచ్చరించారు. 

బాబు పాలనలో నీతి ఎంతగొప్పగా సాగుతోందంటే...దేశంలోనే  అత్యంత భారీ కుంభకోణం రూ.1600కోట్ల హవాలా కుంభకోణం రాష్ట్రంలో వెలుగుచూసిందన్నారు. వడ్డే శ్రీనివాసరావు, మహేష్ లు టీడీపీ మంత్రి, ఎంపీల సహాయంతో వందలాది కోట్లు ఇతరదేశాలకు తరలించి ఏరకంగా  దోపిడీ  చేస్తున్నారో బట్టబయలైందన్నారు.  కానీ ప్రభుత్వం సీఐడీ విచారణతో సరిపెట్టాలని చూస్తోందని భూమన ఫైర్ అయ్యారు. సమస్యను పక్కదోవ పట్టిస్తూ  పరిష్కారానికి పూనుకోకుండా  చేసే నాటకాలు ఆపాలని బాబును హెచ్చరించారు.  విజయవాడ, వైజాగ్ లో జరిగిన హవాలా కుంభకోణానికి సింగపూర్ కు సంబంధం ఉందని భూమన అన్నారు. అమరావతికి సంబంధించిన కన్సార్టియం అప్పగించింది కూడ ఈ సింగపూర్ వాళ్లకేనని ఆరోపించారు. దీంట్లో ఎక్కువగా టీడీపీ వాళ్లకే సంబంధం ఉన్నట్టుగా నిరూపితమవుతోందన్నారు. మా ఆరోపణగా తీసుకోకుండా  బాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా... సీబీఐతో గానీ,  సిట్ దర్యాప్తు సంస్థలతో గానీ, జడ్జిల ఆధీనంలోని సంస్థలతోగానీ విచారణ జరిపించాలన్నారు. బాబు క్యాబినెట్ లోని మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వాకాటి, టీడీపీ ఎంపీ రాయపాటి, కేంద్రమంత్రి సుజనాచౌదరిలో బ్యాంకులకు వేలాది కోట్లు ఎగ్గొట్టిన దొంగలు అని విరుచుకుపడ్డారు.  వాకాటిని సస్పెండ్ చేసిన చంజ్రబాబు గంటా, సుజనా చౌదరి, రాయపాటిలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు.  చంద్రబాబుకు ఏమాత్రం ప్రజాస్వామ్య విలువలు లేవని భూమన దుయ్యబట్టారు. బాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా జైళ్లకు పంపించాలన్న ఆలోచనే తప్ప ఇంకోటి లేదన్నారు. మీరు ఎన్ని వేలమందిని  అరెస్ట్ చేసినా లక్షలాదిమంది మీ దమననీతిని ఎండగడతారని హెచ్చరించారు. జైళ్లన్నీ నెటిజన్ల ద్వారా నిండిపోతాయని అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top