2018 డీఎస్సీ నోటిఫికేషన్ నిరుద్యోగుల్లో నిరాశను నింపింది. చంద్రబాబు ఇచ్చిన బాబొస్తే జాబు హామీ ఉట్టిదని తేలిపోయింది. విసిగిపోయిన నిరుద్యోగ యువత రోడ్లపైకి వస్తున్నారు? బాబూ జాబేది అంటూ ప్రశ్నిస్తున్నారు. జోలెపట్టుకుని తిరుగుతూ బాబ్బాబ్బాబు...ఉద్యోగాలేవి అని నడిరోడ్డుమీద అడుక్కుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలోనే గతంలో 1998 డీఎస్సీ అభ్యర్థులకు బాబు చేసిన ద్రోహం గుర్తు చేసుకుంటున్నారు.1998 డీఎస్సీ ఓ పీడకల1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో డీఎస్సీ జరిగింది. మెగా డీఎస్సీ పేరుతో 40వేల టీచర్ పోస్టుల భర్తీకి అప్పటి విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో నోటిఫికేషన్ వెలువడింది. రాత పరీక్ష 85 మార్కులు, ఇంటర్వ్యూకు 15 మార్కులు, మొత్తం 100 మార్కులకు ఎస్జీటీ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించారు. ఓసీలకు 50, బీసీలకు 45, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 కటాఫ్ మార్కులు నిర్ణయిస్తూ జీవో 221 జీవో విడుదలైంది. రాతపరీక్ష ఫలితాలు ప్రకటించే సమయంలో నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో శాసన సభ ఉప ఎన్నికలు జరుగుతున్నాయ్. దాంతో ఈ 4 జిల్లాల రాత పరీక్షల ఫలితాలను ప్రకటించలేదు. ఇదే నాటి 1998 డిఎస్సీ అభ్యర్థుల పాలిటి శాపం అయ్యింది. రాష్ట్రంలో మిగితా 19 జిల్లాల డిఎస్సీ రాత పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువని తేలింది. కనీసం 15000 పోస్టుల భర్తీ ఆగిపోయేలా ఉందని నివేదికలు చెబుతున్నాయ్. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ప్రత్యేక జీవో 618 విడుదల చేసి కటాఫ్ మార్కులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఓసీలకు 45, బీసీలకు 40, ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 35 కనీస అర్హతగా నిర్ణయించారు. నష్టపోయిన వేలాదిమంది అభ్యర్థులుఅయితే ఉప ఎన్నిక పూర్తి అయిన తర్వాత కటాఫ్ మార్కులను తగ్గించక ముందు, తగ్గించిన తర్వాత ఉన్న రెండు జాబితాలనూ కలిపి ఒకేసారి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆ ఇంటర్వ్యూల్లో అక్రమార్కులు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా వాడుకున్నారు. 1998 డీఎస్సీ ఫస్ట్ లిస్టు అంటే జీవో 618 ప్రకారం రాసిన వారికి తక్కువ కటాఫ్ మార్కుల కారణంగా అభ్యర్థులందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కానీ పాత జీవో ప్రకారం మెరిట్ వచ్చిన అభ్యర్థులు నష్టపోయారు. దీనిపై ఎన్నోఏళ్లుగా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. 1999లో 221 జీవో ప్రకారం మెరిట్ వచ్చిన అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. కానీ చంద్రబాబు ఆదేశాలతో విద్యాశాఖ 2000 సంవత్సరంలో దీనికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లింది. అప్పుడు సైతం అభ్యర్థులకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. దాన్ని కూడా తోసి పుచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. అక్కడా బాబు సర్కార్ కు చుక్కెదురైంది. మెరిట్ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాల్సిందే అంటూ సుప్రీం సైతం ఉత్తర్వులు ఇచ్చింది. కానీ టిడిపి ప్రభుత్వం అభ్యర్థులందరికీ ఉద్యోగాలిచ్చామని, అభ్యర్థులు లేనందువల్లే కటాఫ్ మార్కులు తగ్గించామని కోర్టుకు నివేదిక ఇచ్చింది. దీనపై 98 డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇచ్చానని చెప్పడం అబద్ధమని వారు హైకోర్టులో అప్పీలు చేసారు. నేటికీ నాటి డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం దక్కలేదు. చంద్రబాబు భారీ ఉద్యోగాల భర్తీ చేసాననే పేరు కోసం ఇచ్చిన జీవో 618 వేలాదిమంది అభ్యర్థుల జీవితాలను చీకట్లో నెట్టేసింది. మెరిట్ సాధించి కూడా ఉద్యోగాలకు దూరమైన ఆ అభ్యర్థుల మనోవ్యథకు కారణం ముమ్మాటికీ చంద్రబాబే.