రిటైర్డ్‌ ఉద్యోగి మృతికి ఎమ్మెల్యే నారాయ‌ణ‌స్వామి సంతాపం

చిత్తూరు:  వెదురుకుప్పం మండలంలోని సీఆర్‌ కండ్రిగ గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి బండి వాసుదేవరెడ్డి(75) బుధవారం రాత్రి బావిలో పడి మృతి చెందాడు. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ బావిలో పడి ఊపిరాడక అక్కడికక్కడే కన్నుమూశాడు.  విషయం తెలుసుకున్న గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కే. నారాయణస్వామి గురువారం ఉదయం గ్రామానికి వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. వాసుదేవరెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన వెంట  మండల పార్టీ అధ్యక్షుడు పేట దనంజేయులు రెడ్డి, ఎంపీపీ పురుషోత్తం, మండల ఉపాద్యక్షుడు ఎస్‌ దనంజయ రెడ్డి, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు భాస్కర్‌ రెడ్డి, శివాజి, నాయకులు చిన్నస్వామి,  విజయశేఖర్‌ రెడ్డి, కార్యకర్తలు ఉన్నారు.  

Back to Top