నేడు, రేపు షర్మిల పాదయాత్ర ఇలా..


అనంతపురం:

వైయస్ జగన్ తరఫున సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర దసరా పండుగ రోజు బుధవారం అనంతపురం జిల్లాలో కొనసాగుతుందని కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్ర తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి, పెదకోట్ల, తాడిమర్రి, శివంపల్లి మీదుగా సాగనుంది. రాత్రి శివంపల్లికి 2.2 కి.మీ. దూరంలో రోడ్డు పక్కన వేసిన గుడారాల్లో షర్మిల బస చేయనున్నారు. బుధవారం 15 కి.మీ. మేర పాదయాత్ర సాగనుంది. గురువారం ఆత్మకూరు, తమ్మాపురం, సుబ్బరావుపేట క్రాస్, తుమ్మల క్రాస్ మీదుగా దాదాపు 14 కి.మీ. మేర పాదయాత్ర సాగనుంది. తుమ్మలక్రాస్ శివార్లలో రాత్రికి బస చేస్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top