మున్సిపల్ సమీక్ష

హైదరాబాద్ః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అధ్యక్షతన లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష సమావేశం జరుగుతోంది. త్వరలో ఏపీలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలతో వైయస్ జగన్ చర్చిస్తున్నారు. అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయా జిల్లాల అధ్యక్షులు, కార్పొరేషన్, మున్సిపల్ అబ్జర్వర్లు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.


విశాఖపట్నం, గుంటూరు,  తిరుపతి,  కాకినాడ,  ఒంగోలు, కర్నూలు, శ్రీకాకుళం ఏడు చోట్ల  కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా విజయనగరం జిల్లా నెల్లిమర, కడప జిల్లా రాజంపేట, శ్రీకాకుళం జిల్లా రాజాం, ప్రకాశం జిల్లా కందుకూరు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మునిసిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి.
Back to Top