ఎంపీగా మేకపాటి ప్రమాణ స్వీకారం

నెల్లూరు నుంచి ఎంపీగా ఎన్నికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ఎంపీలుగా ఎన్నికైన మేకపాటి రాజమోహన్ రెడ్డి, సమాజ్‌ వాది పార్టీ నాయకురాలు, యూపీ సీఎం సతీమణి డింపుల్‌ యాదవ్‌ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మేకపాటి రాజమోహన్‌ రెడ్డి తెలుగులో ప్రమాణం చేయగా, డింపుల్‌ యాదవ్‌ హిందీలో ప్రమాణం చేశారు.

తాజా వీడియోలు

Back to Top