బాబును డాక్టర్‌కు చూపించండయ్యా..

హైదరాబాద్‌: చంద్రబాబు మానసిక స్థితి బాగాలేదని, ఆయన్ను డాక్టర్లకు చూపించాలంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు వైఖరిపై విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశాడు. ‘రెండు మూడు రోజుల్లో చంద్రబాబు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారట. పెద్ద నోట్ల రద్దు చేసి మోదీ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశాడు. అందుకే మా నోట్లు మేమే ముద్రించుకుంటాం. మేమూ మిలటరీని ఏర్పాటు చేసుకుంటాం. మా రైళ్లు, విమానాలను మేమే నడుపుకుంటాం. 2050 దాకా ఎన్నికలు అవసరం లేదని జీఓ తెస్తాం. ఐదేళ్లకోసారి ఎన్నికలతో అభివృద్ధి నిలిచిపోతుంది. దీన్ని చంద్రం ఎఫెక్ట్‌ అంటారట. బాబుగారు పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. మొన్న ఎయిర్‌పోర్టులో వైయస్‌ జగన్‌ గారిపై హత్యకు స్కెచ్‌ వేసి అది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రదేశం, మాకేం సంబంధం అన్నారు. ఇప్పుడేమో సీబీఐకి మా రాష్ట్రంలో ఏం పని అడుగుపెట్టనిచ్చేది లేదంటున్నారు. మానసిక రుగ్మతలన్నీ ఒకేసారి దాడి చేస్తున్నట్లున్నాయి. చంద్రబాబును డాక్టర్‌కు చూపించండయ్యా పాపం బ్యాలెన్స్‌ కోల్పోయాడు’ అని ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. 

Back to Top