టీడీపీని గద్దె దించేందుకు ఐక్యం కావాలి

టీడీపీని గద్దె దించేందుకు ఐక్యం కావాలి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి
జె్రరిపోతులపాలెంలో దళిత మహిళలకు పరామర్మ∙
రూ. లక్ష ఆర్థిక సాయం అందించిన వైయస్‌ఆర్‌ సీపీ
దాడికి పాల్పడిన వారిని ఎవరినీ వదిలి పెట్టం

విశాఖపట్నం: టీడీపీ సర్కార్‌ను గద్దె దించేందుకు ప్రజలంతా ఐక్యం కావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా జె్రరిపోతులపాలెంలో టీడీపీ నేతల దాడిలో గాయపడిన దళిత మహిళలను ఎంపీ విజయసాయిరెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత మహిళలకు పార్టీ తరుపున రూ. లక్ష ఆర్థిక సహాయం అందజేసి ధైర్యం చెప్పారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..దళిత మహిళపై దాడి చేసిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఆయన కుమారుడు అప్పలనాయుడు కుట్రదారులుగా ఉన్నట్లు బాధితులు చెప్పారన్నారు. సత్యనారాయణ, అప్పలనాయుడుపై ఏ1, ఏ2 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ముదపాక ఎస్సీ భూములను కూడా కబ్జా చేసేందుకు బండారు ప్రయత్నించారన్నారు. 

టీడీపీ సర్కార్‌లో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. దళితుల భూములను కబ్జాలు చేస్తూ అడ్డొచ్చిన వారిపై దాడులు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇప్పుడు  తాత్కాలికంగా వారు తప్పించుకోవచ్చు కానీ, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వారికి శిక్ష తప్పదన్నారు. 2014లో దళితులకు శిరోముండలం చేసిన వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టి ఎమ్మెల్యేగా గెలిపించారంటే టీడీపీ చిత్తశుద్ధి ఎంటో అర్థం అవుతుందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా దళితులపై దాడులు జరుగుతునే ఉన్నాయని, గరగప్రరు, తుందుర్తి, దేవరపల్లి లాంటి ఘటనలు ఇందుకు నిదర్శనమన్నారు. జె్రరిపోతుల సమస్య దళిత సామాజిక వ్యవస్థలో చైతన్యం తీసుకురావాలి. టీడీపీకి ఓటు వేయడమే దళితులు చేసిన తప్పా.. టీడీపీ సర్కార్‌ను దించేందుకు ప్రజలంతా ఐక్యం కావాలన్నారు. దళిత మహిళను పరామర్శించిన వారిలో పార్టీ నేతలు మల్లా విజయప్రసాద్, సైనాల విజయ్‌కుమార్, కల్యాణి తదితరులు పాల్గొన్నారు. 
 
Back to Top