శ‌క్తి మేర‌కు పోరాడుతున్నాం

న్యూఢిల్లీ:  తమ శక్తి మేరకు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని, రాజకీయాలు పక్కనబెట్టి ఇకనైన టీడీపీ ఎంపీలు తమతో కలిసి రావాలని దీక్ష కొనసాగిస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ఇది రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన సమస్య అని గుర్తుచేశారు. నాలుగో రోజు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌లో ఆయ‌న మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. గతంలో హోదా కోసం ఉద్యమాలు చేస్తే చంద్రబాబు అరెస్టు చేయించారని, గత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా హోదా కోసం డిమాండ్‌ చేయని చంద్రబాబు.. ఇప్పుడు ప్రజల్లో తనపై వ్యతిరేకత వస్తుండటంతోనే యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు.

తాజా వీడియోలు

Back to Top