బాధ్యతల స్వీకరణకు తరలిరండి

మాచర్ల, వైయస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ విభాగ అధ్యక్షుడిగా ఎంపికై ఈనెల 14వ తేదీన గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బాధ్యతలు స్వీకరించనున్న జంగా కృష్ణమూర్తి కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కామనబోయిన కోటయ్య, వైయస్సార్‌సీపీ జిల్లా నాయకులు, న్యాయవాది జీవీ, కంచర్ల నాగరాజు, బలిగుడ్ల శ్రీనివాస్‌లు బుధవారం పిలుపునిచ్చారు. స్థానిక జీవీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో మొదటి నుంచి బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసి అన్ని వర్గాల వారికి చేయూతనిచ్చిన జంగా కృష్ణమూర్తి పార్టీ రాష్ట్ర బీసీ విభాగ అధ్యక్షుడిగా ఎంపిక కావటం అభినందనీయమని వారు అన్నారు. ఆయన బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి పల్నాడు ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో వైయస్సార్‌సీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు నోముల కృష్ణ, పలువురు వైయస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

Back to Top