మదర్‌ థెరిస్సా స్ఫూర్తితో సేవలు

సాగర్‌నగర్‌: మానవ సేవే మాదవ సేవ..అంటూ ఎంతో మంది అభాగ్యులు, నిరుపేదలకు ఆర్థికసాయం చేస్తూ, సేవలందిస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత రాజేష్‌కుమార్‌ అగర్వాల్‌ సేవలు స్మరణీయమని పలువురు కొనియాడారు. విశాఖ జిల్లా సాగర్‌నగర్‌ ఎంఎస్‌పి కాలనీ(ముసలయ్యపాలెం)లో అపద్భాందువు సంఘమిత్ర సంస్థ, శ్రీకృష్ణసాయి యువజన సేవా సంఘం సంయుక్తంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వాణిజ్య సెల్‌ కన్వీనర్, అపద్భాందువు సంఘమిత్ర సంస్థ చైర్మన్‌ రాజేష్‌కుమార్‌ అగర్వాల్, ప్రియ అగర్వాల్‌ దంపతులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వార్డు అధ్యక్షుడు లొడగల రామ్మోహాన్‌  మాట్లాడుతూ మాట్లాడే పెదవలకన్నా..సాయం చేసే చేతులు మిన్నా అనే మదర్‌ థెరిస్సా స్పూర్తితో రాజేష్‌ పనిచేస్తున్నారన్నారు. నిరుపేదలకు చేస్తున్న ఆర్థికసాయం, సామాజిక సేవా కార్యక్రమాలతో పేదకుటుంబాలు బలోపేతం అవుతున్నాయన్నారు. అనంతరం రాజేష్‌ అగర్వాల్‌ దంపతులు వృద్థులకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు.

Back to Top