యూ టర్ను తీసుకున్నట్టు బాబు, కిరణ్‌ నటన

కడప, 27 నవంబర్ 2013:

రాష్ట్ర విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమా‌ర్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే కారణమని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యేలు‌ జి. శ్రీకాంత్‌రెడ్డి, అమర్నా‌థ్రెడ్డి ఆరోపించారు. సమైక్యాంధ్ర ఉద్యమ ఉధృతిని చూసి యూటర్సు తీసుకున్నట్లు చంద్రబాబు నాయుడు, కిరణ్లు నటిస్తున్నారని ‌నిప్పులు చెరిగారు. సమైక్య రాష్ట్రం కోసం శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఒక్కరే పోరాడుతున్నారని వారు పేర్కొన్నారు.

కడపలో వారు బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ... కిరణ్ కుమా‌ర్‌రెడ్డి ముఖ్యమంత్రి సీటులో కూర్చుని రాష్ట్ర విభజనకు సూచనలు ఇస్తున్నారని వారు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు చంద్రబాబు తన‌ వంతు కృషి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సమైక్య వాదానికా లేక విభజన వాదానికి అనుకూలమో తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని కిరణ్, చంద్రబాబులను ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Back to Top