హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావును కలిశారు. అసెంబ్లీ లాంజ్ లో తొలగించిన ఇవంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర పటాన్ని తిరిగి అక్కడే ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఏకపక్షంగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇటువంటి చర్యలు తీసుకోవటంపై తమ నిరసన తెలిపారు. గత సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించటాన్ని తప్పుపట్టారు.<br/>వాస్తవానికి చిత్ర పటాన్ని తొలగించారని తెలుసుకొన్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గత నెల 31నే అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్ అందుబాటులో లేకపోవటంతో అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ కు వినతి పత్రం అందించారు. రెండు రోజుల్లో చర్యలు తీసుకొంటామన్న హామీతో వెను దిరిగారు. కానీ, ఎటువంటి ఫలితం లేదు. ఇటీవల జరిగిన కమిటీ ఇన్ జనరల్ పర్పసస్ సమావేశంలో కూడా దీని మీద ఎలాంటి నిర్ణయం జరగలేదు. స్పీకర్ తో భేటీ తర్వాత వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ ధర్నా నిర్వహించారు. <iframe width="700" height="400" src="https://www.youtube.com/embed/VFK-WLb4Shc" frameborder="0"/>