జనమంతా వైయస్‌ జగన్‌ వెంటే

 

అనంతపురం: ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీ మారినంత మాత్రనా ఎలాంటి నష్టం జరుగలేదని, ప్రజలంతా వైయస్‌ జగన్‌ వెంట ఉన్నారని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. నల్లమాడ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినంతమాత్రానా వైయస్‌ఆర్‌సీపీ కనుమరుగవుతుందని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని అన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు పోయినా లెక్క చేయమని, మేమంతా వైయస్‌ జగన్‌ వెంటే ఉంటామని ప్రజలు తోడుగా నిలుస్తున్నారని చెప్పారు. నీ తప్పులను, అప్రజాస్వామిక విధానాలను క్షమించమని ప్రజలు హెచ్చరిస్తున్నారని చెప్పారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు అశేషంగా జనం తరలిరావడమే ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శమన్నారు. అధికార పక్షం నేతలు వైయస్‌ జగన్‌పై విమర్శలు చేయడం దారుణమన్నారు. 9 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చూస్తే భయం పుట్టుకుంటుందన్నారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించడం లేదని, ప్రజా ప్రతినిధులను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. గౌరవం అన్నది ఇచ్చిపుచ్చుకోవాల్సిన అంశమని, చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గౌరవించడం లేదన్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మాకు ఒక్క చిన్న అధికారం కూడా ఇవ్వలేదన్నారు. ఒక గుంత పూడ్చి అవకాశం అయినా ఇచ్చారా అని నిలదీశారు. ఇదేనా మీ అనుభవం అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యమంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. చంద్రబాబు మీద పోరాటమే ప్రజా సంకల్ప యాత్ర అని తెలిపారు. వైయస్‌ జగన్‌ ప్రజలకు ఇస్తున్న హమీలను వారు నమ్ముతున్నారని, వైయస్‌ జగన్‌ ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పేవారు కాదన్నారు. చంద్రబాబు అంటే అబద్ధాలకు ప్రతిరూపంగా ప్రజలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.
 
Back to Top