కట్జూను కూడా అరెస్టు చేయిస్తాడేమో?

  • పోలీస్‌ వ్యవస్థను అడ్డం పెట్టుకొని చంద్రబాబు దుర్మార్గపు పాలన 
  • సోషల్‌ మీడియా వేదికగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి లేఖ
  • బాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని రాష్ట్రపతి, ప్రధానికి కట్జూ లేఖ
  • శిశుపాలుడికి పట్టిన గతే చంద్రబాబుకు పడుతుంది
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
హైదరాబాద్‌: పోలీస్‌ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రశ్నించే ప్రతీవాడిని శిక్షించాల్సిందే అనే ధోరణిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అన్యాయంగా, అక్రమంగా ఆంధ్రరాష్ట్ర సొత్తును దోచుకుంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తుంటే...బాబు వారిని దారుణంగా హింసిస్తున్నాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు దుశ్చర్యలపై ఆర్కే విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 19(1)(ఏ) సబ్‌సెక్షన్‌ కింద ఉన్న భావప్రకటన స్వేచ్ఛను కూడా చంద్రబాబు హరిస్తున్నాడని ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఖరి వల్ల రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. ఆఖరికి పెన్షన్లు, రేషన్‌ అందడం లేదని అడుతుతున్న వాళ్లను కూడా జన్మభూమి కమిటీలను అడ్డం పెట్టుకొని వేధిస్తున్నాడని వివరించారు. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వాగ్ధానాలు మర్చిపోయారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నింస్తుంటే చంద్రబాబులో వణుకుపుడుతోందన్నారు. ఎందుకు వాళ్లను అరెస్టులు చేయించి జైళ్లకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అన్యాయాలు, అక్రమాలు పతాకస్థాయికి చేరుకోవడానికి దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తోందన్నారు. 

అమెరికాకు పోలీసులను పంపి కట్జూను అరెస్టు చేయిస్తారా..?
చంద్రబాబు నియంత పరిపాలనపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని రాష్ట్రపతి, ప్రధానిలకు లేఖ రాయడం జరిగిందని ఆర్కే పేర్కొన్నారు. ఆంధ్రరాష్ట్రంలో పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు. ప్రశ్నించిన ప్రతీవారిని పోలీసులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్‌ 356ని ఉపయోగించి ఏపీ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్‌ చేయండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి అని లేఖ రాశారన్నారు. చంద్రబాబు తీరు చూస్తే చివరకు లేఖ రాసిన న్యాయమూర్తిపై కేసులు పెట్టి పోలీసులను అమెరికా పంపించైనా అరెస్టు చేయిస్తారేమోనని అనుమానం కలుగుతుందన్నారు. కట్జూ లేఖ, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ లేఖ, ఎంపరర్‌ ఆఫ్‌ కరెప్షన్‌ అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని.... రాష్ట్రపతి, ప్రధాని ఆర్టికల్‌ 356 ప్రకారం చర్యలు తీసుకుందామనే ఆలోచన వచ్చినా వాళ్లను కూడా అరెస్ట్ చేయిస్తారేమోనని కొంత భయంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకోవాలని, దేశ పౌరుడికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కలకు అనుగుణంగా పనిచేస్తున్న వారిని ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, నూరు తప్పులు చేసిన శిశుపాలుడు ఏ విధంగా అంతమయ్యాడో.. అదేగతి మీకు పట్టేరోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. 
Back to Top