మూడో రోజు ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పాదయాత్ర

వైయస్‌ఆర్‌ జిల్లా:

గండిపేట నుంచి సర్వరాయసాగర్‌కు నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ కమలాపురం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర మూడో రోజుకు చేరింది. నీటి కోసం సాగుతున్న పాదయాత్రకు ఎమ్మెల్యే అంజద్‌బాషా, ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. సర్వరాయసాగర్‌కు నీరు విడుదల చేయకపోతే కలెక్టరేట్‌ వద్ద నిరాహార దీక్ష చేపడుతామని రవీంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

Back to Top