వైయస్‌ఆర్ జిల్లా: పుంగనూరులో దాడులకు కారణమైన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై క్రిమినల్ కేసులు పెట్టాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. నిన్న టీడీపీ శ్రేణుల దాడిని శ్రీకాంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకనే చంద్రబాబు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాడు. ఎల్లోమీడియా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ప్రతి ప్రాజెక్టుపై చర్చ జరపడానికి వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తాడని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడే ధైర్యం లేకే చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. కార్యకర్తలను ఉసిగొల్పి చంద్రబాబు దాడులు చేయించారని పేర్కొన్నారు. కుప్పంకు ఏనాడైనా చంద్రబాబు నీళ్లిచాడా అని నిలదీశారు. 14 ఏళ్లలో చంద్రబాబు ఒక్క మంచి పని చేయలేదన్నారు. చంద్రబాబు పాలిస్తే రాష్ట్రంలో కరువు, కాటకాలు ఉంటాయన్నారు. చంద్రబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అరాచకం, అనావృష్టి కలుగుతుందన్నారు. చంద్రబాబు ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు స్వయంగా చేరవేయలేదన్నారు. ఆయన పాలనలో పేదలకు సంక్షేమం అందలేదని విమర్శించారు. టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు ప్రజలకు కనబడకుండా చేశారని, 70 ఏళ్ల వయసు దాటినా చంద్రబాబుకు ఇంగితజ్ఞానం లేదన్నారు. మంచి పని చేశానని చెప్పి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాలు విసిరారు. నిన్నటి దాడిలో గాయపడిన ప్రతి వ్యక్తికి చంద్రబాబు పరిహారం ఇవ్వాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండు చేశారు. దాడుల్లో దెబ్బతిన్న పోలీసు వాహనాలను చంద్రబాబు తిరిగి సమకూర్చాలన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పాలని శ్రీకాంత్‌రెడ్డి కోరారు. కుప్పంలో చంద్రబాబు ప్రజాదరణ కోల్పోవడంతోనే దాడులు చేయిస్తున్నారని, కుప్పంలో చంద్రబాబును ఓడిస్తే రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందన్నారు.