చ‌లివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గ‌డికోట‌

రాయచోటి రూరల్‌: స్థానిక రాజులకాలనీలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభించారు. బాట‌సారుల దాహార్తిని తీర్చేందుకు ముందుకు వచ్చి వేసవిలో ప్రజలకు అందుబాటులో మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేయడం సంతోషకరమైన విషయం అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి, వైయ‌స్సార్ సీపీ నాయకులు విజయభాస్కర్, సురేష్‌కుమార్‌రెడ్డి, నాగిరెడ్డి, సిద్దారెడ్డి, మల్లిఖార్జునరెడ్డి, సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top