వైయస్సార్సీపీలోకి మైనారిటీ నాయకులు

గుంటూరుః వైయస్సార్సీపీలోకి వలసలు మరింతగా ఊపందుకున్నాయి. వైయస్ జగన్ నాయకత్వానికి ఆకర్షితులై వివిధ వర్గాల ప్రజలు, పార్టీల నేతలు వైయస్సార్సీపీలో చేరుతున్నారు. తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో బాలాజీరావుపేట 32వ వార్డుకు చెందిన మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరారు. వీరందరికీ శివకుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అన్నా బత్తుని మాట్లాడుతూ...ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి అవినీతి పరిపాలన చేస్తున్న ఘనత చంద్రబాబునాయుడుకే దక్కిందని ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top