వైయస్ జగన్ ను ఆశీర్వదించిన ముస్లిం మత పెద్దలు

హైదరాబాద్‌: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు ముస్లిం మత పెద్దలు ఆయన నివాసంలో కలుసుకుని ఆశీర్వదించారు. పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు హెచ్‌.నదీం అహ్మద్‌ ఆధ్వర్యంలో అనంతపురం నుంచి వచ్చిన ‘జమైతుల్‌ ఉలేమా హింద్‌’కు చెందిన మత పెద్దలు జగన్‌కు సంప్రదాయ రుమాలును కప్పి టోపీని ధరింపజేశారు.

జగన్‌కు అన్ని విధాల శుభం కలగాలని, రాజకీయాల్లో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. దివంగత సీఎం వైయస్‌ రాజశేఖరరెడ్డి కల్పించిన 4 శాతం రిజర్వేషన్ల వల్ల ఎంతో మంది ముస్లిం విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని కొనియాడారు.
Back to Top