గుంటూరు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు ఊపందుకున్నాయి. గుంటూరు పట్టణానికి చెందిన మైనారిటీ నాయకుడు సుభాని, అతని అనుచరులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్‌బాబు, మనోహర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..అందరం కలిసి కట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకువద్దామన్నారు.