వైయస్‌ జగన్‌ సీఎం కావాలని ముస్లింల ప్రార్థనలు


ప్రకాశం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను ముస్లింలు కలిసి దువా చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ..దివంగత  ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకు మేలు జరిగిందన్నారు. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ఎంతోమంది ఉన్నత చదువులు చదివారని, ఉద్యోగాలు పొందారని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితే ముస్లింల సంక్షేమానికి మహానేత మాదిరిగానే కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులు కూడా జననేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. వారందరికీ వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు.
 
Back to Top